ఈ నామాలను నిత్యం స్మరిస్తే సదా శివానుగ్రహం లభిస్తుంది
శివాయ నమః-anugraha krutyam
మహేశ్వరాయ నమః-tirodhana krutyam
రుద్రాయ నమః-samhara krutyam
విష్ణవే నమః -sthithi krutyam
పితామహాయ నమః -srusti krutyam
సంసారవైద్యాయ నమః -papanashakudu, dukha nashakudu, rogamulu pogottu vadu
సర్వజ్ఞాయ నమః-anni telisina vaadu
పరమాత్మనే నమః -srusti ki ateethamainatuvanti vaadu
శివుని యొక్క అష్టమూర్తి తత్త్వం:
శర్వాయ క్షితిమూర్తయే నమః
భవాయ జలమూర్తయే నమః
రుద్రాయ అగ్నిమూర్తయే నమః
ఉగ్రాయ వాయుమూర్తయే నమః
భీమాయ ఆకాశమూర్తయే నమః
ఈశానాయ సూర్యమూర్తయే నమః
మహాదేవాయ చంద్రమూర్తయే నమః
పశుపతయే యజమాన మూర్తయే నమః
భవాయ దేవాయ నమః
శర్వాయ దేవాయ నమః
ఈశానాయ దేవాయ నమః
పశుపతయే దేవాయ నమః
రుద్రాయ దేవాయ నమః
ఉగ్రాయ దేవాయ నమః
భీమాయ దేవాయ నమః
మహతే దేవాయ నమః
(శివారాధన లో వాడుతారు)
అమ్మవారు 8 నామాలు-శక్తి నామాలు:
భవస్య దేవస్య పత్న్యై నమః
శర్వస్య దేవస్య పత్న్యై నమః
ఈశానస్య దేవస్య పత్న్యై నమః
పశుపతయే దేవస్య పత్న్యై నమః
రుద్రస్య దేవస్య పత్న్యై నమః
ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః
భీమస్య దేవస్య పత్న్యై నమః
మహతే దేవస్య పత్న్యై నమః
ఎవరైతే ఈ నామాలతో శివుని ఆరాధన చేస్తారో వారికి తమలో ఉన్న ఎనిమిది రకాల ప్రకృతులు తమ చుట్టూ ఉన్న ఎనిమిది రకాల ప్రకృతి కూడా శివంగా మారిపోతుంది. శివం అంటే మంగళం అని అర్ధం. మంగళ స్వభావము కలవాడు శివుడు.
ఉదాయన్నే నిద్ర లేస్తునే చదవవలిసిన స్తోత్రం:
కరమాలతో జపించు పధ్ధతి from PadmaSekhar: Karamaala Japam
దుర్గ రక్ష, దుఃఖము నుండి బయట పడటానికి:
శ్రీ ఆర్యాయై నమః ; శ్రీ దుర్గాయై నమః ; శ్రీ వేదగర్భాయై నమః ; శ్రీ అంబికాయై నమః ; శ్రీ భద్రాయై నమః ; శ్రీ భద్రకాళ్యై నమః ; శ్రీ క్షేమ్యాయై నమః ; శ్రీ క్షేమంకర్యై నమః
గజేంద్ర మోక్షం శ్లోకం -ఆరోగ్యానికి , ఐశ్వర్యానికి,సర్వ రోగాలు నశించడానికి,సూర్యుడు ముందు కూడా చదవచ్చు.
ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయాభిధీమహీ యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదం స్వయం యస్మాత్పరస్మాచ్చ పరః తంప్రపద్యే స్వయం భువం
మనశ్శుద్ధికి హనుమ ధ్యానశ్లోకం – బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ:
వామేజానుని వామబాహుమపరం ఙ్ఞానాక్షముద్రాన్వితం
హ్రుద్దేశేకలయన్ నుతో మునిగణైః అధ్యాత్మ తత్వేక్షణం
ఆసీనః కదళీవనే మణిమయే బాలార్క కోటిప్రభః
ధ్యాయన్ బ్రహ్మపరం కరోతు మనసశ్శుద్ధిం హనూమాన్ మమ
సర్వరోగహరం : శ్రీ ధన్వంతరయే నమః
దుఃఖ నివారణ శ్లోకం :
సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయా
ప్రసీదసుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా
దుఃస్వప్న దోషాలు పోవడానికి:
ప్రాతః కాలంలో బృహస్పతికి, ఇంద్రుడికి, బ్రహ్మ దేవుడికి, అగ్నిదేవుడికి నమస్కారం చేసుకుని, నా వాళ్ళు అందరు క్షేమంగా ఉండాలని అనుకోవాలి. (from Ramayanam)
భాగవతంలో నారాయణునిచే చెప్పబడ్డ ఈ నామాలను నిత్యమూ స్మరిస్తే అన్ని రకముల అరిష్టములు, ఆదివ్యాధులనుండి రక్షింపబడతారు:
దుర్గ,భద్రకాళి,విజయ,చండిక,కుముద,మాయ,అంబికా,శారదా,నారాయణి,ఈశాని,కృష్ణ,వైష్ణవి, మాధవి,కన్యకా
ఈ మంత్రాన్ని మీ వాహనాలు పై రాసుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు:
శ్రీ రామ రక్ష సర్వజగద్రక్ష, శ్రీ క్షేమంకర్యై నమః
యమధర్మ రాజు ధ్యాన శ్లోకం:
బాధస్సైయుత మేఘసన్నిభతనుః ప్రజ్జోతనస్యాత్మజో రుణా పుణ్య కృతాం శుభావ: వపు:
పాపీయసామ్ దుఃఖకృత్ శ్రీమాన్ దక్షిణ దిక్పతిర్మహిషగో భూషాంబరాలంకృతో ధ్యేయస్సయ్యమని పతిః పితృగణా స్వామి యమోదండ భృత్
యమధర్మ రాజు నామాలు:
శ్రీ యమాయ నమః, శ్రీ సమవర్తినే నమః, శ్రీ మృత్యవే నమః, శ్రీ అంతకాయ నమః, శ్రీ ధర్మరాజాయ నమః, శ్రీ కాలాయ నమః, శ్రీ వైవస్వతాయ నమః, శ్రీ సూర్యాత్మజాయ నమః, సర్వభూతక్షయాయ నమః, చిత్రాయ నమః, చిత్రాగుప్తాయా నమః, శమనాయ నమః, దధ్యాయ నమః, నీలాయ నమః,వృకోదరాయ నమః
చిత్రగుప్తులు ధ్యానం శ్లోకం:
సిద్ధమంత్రం ఇమంపుంసాం జపతాం చిత్రగుప్తాకః ప్రసన్నో గణయ్యేత్ పుణ్యం పాపంన్నైవ కదాచన
ధ్యానం శ్లోకం ,నామాలు చదువుకుంటే పాపవినాశనం చేస్తారు యమధర్మ రాజు, చిత్రగుప్తులవారు .
సూర్య ఆరాధన ప్రవచనం లో గురువుగారు చెప్పినవి, శ్రీ సూర్య ఏక వింశతి నామావళి
1.Vikartana
🌹 వికర్తన
(The one who destroys all dangers)
2.Vivaswana
🌹 వివస్వాన్
(Luminescent)
3.Martanda
🌹 మార్తాండ
(The one who has emerged from the golden egg)
4.Bhaskara
🌹 భాస్కర
(The enlightening one)
5.Ravi
🌹 రవి
(The one who roars)
6.Lokaprakashaka
🌹 లోకప్రకాశకః
(The illuminator of the worlds)
7.Shriman
🌹 శ్రీమాన్
8.Loka Chakshuhu
🌹 లోక చక్షుః
(Eye of the world)
9.Maheshwarah
🌹 మహేశ్వరః
10.Loka Sakshi
🌹 లోకసాక్షి
(Witness of the world)
11.Trilokeshaha
🌹 త్రిలోకేశః
(The lord of the three worlds)
12.Karta
🌹 కర్త
(The executor)
13.Harta
🌹 హర్త
(The destroyer)
14.Tamisraha
🌹 తమిస్రః
(The remover of darkness)
15.Tapanaha
🌹 తపనః
(The one who heats up)
16.Taapanaha
🌹 తాపనః
(The one who burns)
17.Shuchihi
🌹 శుచిః
(The one who is pure)
18.Saptashvavahanaha
🌹 సప్తాశ్వ వాహనః
(Whose chariot is drawn by seven horses)
19.Gabhastihastaha
🌹 గభస్తి హస్తః
(Whose hands are rays alike)
20.Brahmanyaha
🌹 బ్రహ్మణ్యః
(The creator of the world)
21.Sarvadevanamaskrutaha
🌹 సర్వ దేవ నమస్కృతః
(Worshiped by all the gods)
॥ఇతి శ్రీ సూర్య ఏక వింశతి నామావళి సంపూర్ణం॥
ఫలశ్రుతి:
ఈ నామాలతో ఎవరైతే ప్రాతఃకాలంలో లేచి నమస్కరిస్తారో వారికి ఏ రోగ భయం వుండదు,పాతకములు,వ్యాధులు తొలగుతాయి.త్రి సంధ్యలలో చదివిన పరమపదం పొందుతారు. ఎప్పటి పాపం అప్పుడే కడిగేస్తుంది ఈ సూర్య నామస్మరణ వలన. *భవిష్యోత్తర పురాణం లో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినది*
ఆదిశంకరభగవత్పాదుల విరచిత శ్రీ రామకర్ణామృతం లో పన్నెండు మంగళ శ్లోకాలు నిత్యం చదువుకుంటే మొత్తం రామాయణం చదువుకున్న పుణ్యం అని ఆ శ్లోకాలని చాలా చక్కగా వివరించారు పూజ్యగురుదేవులు సామవేదం షణ్ముఖ శర్మ గారు.నిజముగా కర్ణములకు అమృతం ఆ శ్లోకాలు:
1. మంగళం కోనలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయా సార్వభౌమాయ మంగళమ్ ||
2. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే|
పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్ ||
3. విశ్వామిత్రంతరంగాయ మిధిలానగరీపతే:|
భాగ్యానాం పరిపాలాయ భవ్యరూపాయ మంగళమ్
4. పితృభక్తాయ సతతం భ్రాతృభి స్సహసీతయా|
వందితాఖిల లోకాయ రామచంద్రాయ మంగళమ్ ||
5. త్యక్తసాకేతవాసాయ చిత్రకూట విహారిణే
సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళమ్||
6. సౌమిత్రిణాచ జానక్యాచాపబాణాసి ధారిణే |
సంసేవ్యాయ సదా భక్త్యా సానుజాయాస్తుమంగళమ్ ||
7. దండకారణ్య వాసాయ ఖండితామరశత్రవే
గృధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళమ్ ||
8. సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషిణి
సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్యుక్తాయ మంగళమ్ ||
9. హనుమాత్సమవేతాయ హరీశాభీష్టదాయినే
వాలి ప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళమ్ ||
10. శ్రీమతే రఘవీరాయ సీతోర్లంఘిత సింధవే
జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళమ్ ||
11. అసాధ్య నగరీం దివ్యా మభిషిక్తాయ సీతయా |
రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళమ్ ||
12. విభీషణం కృతే ప్రీత్యా విశ్వాభీష్ట ప్రదాయినే
జానకీ ప్రాణనాధాయ సదా రామాయ మంగళమ్ |
అశోక వనములో సీతమ్మ ఎలా ఉన్నదో వివరిస్తున్న శ్లోకం, వాల్మీకీ రామాయణంలోనిది. ఒకవైపు పువ్వులతో ఫలములతో అందంగా ఉన్నటువంటి ఆ వనమును కానీ, మరో వైపు భయంకరమైన రాక్షసీ స్త్రీలను కానీ పట్టించుకోవడంలేదుట సీతమ్మ, కేవలం రాములవారిని మాత్రమే ధ్యానిస్తున్నది. ఇది భక్తుడికి ఉండవలసిన లక్షణం అని శ్రీ గురువుగారు చక్కగా వివరించారు.
నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్పుష్పఫలద్రుమాన్ |
ఏకస్థహృదయా నూనం రామమేవానుపశ్యతి ||
మహిమాన్వితమైన ఈ పన్నెండు నామాలు మూడు సంధ్యలలో చదవడం వల్ల సకల పాపముల నుండి విముక్తుడై రుద్రలోకాన్ని చేరుతాడని శాస్త్ర వచనం:
ప్రథమంతు మహాదేవో ద్వితీయస్తు మహేశ్వరః
తృతీయః శంకరో ఙ్ఞేయః చతుర్థో వృషభద్వజః
పంచమః కృత్తివాసస్చ షష్ఠః కామాంగనాశనః
సప్తమో దేవదేవేశః శ్రీకంఠశ్చాష్టమః స్మృతః
ఈశ్వరో నవమో ఙ్ఞేయః దశమః పార్వతీపతిః
రుద్ర ఏకాదశశ్చైవ ద్వాదశః శివ ఉచ్యతే
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
ముచ్యతే సర్వపాపేభ్యో రుద్రలోకం స గచ్ఛతి
ఈ నామములు స్మరణ పాపనాశనము:
వేంకటాద్రికి మారు పేర్లుగా కొన్ని నామాలను బ్రహ్మాండపురాణం లో తెలియజేస్తోంది.అవి అంజనాద్రి,వృషాద్రి,శేషాద్రి,గరుడాచలము,తీర్థాద్రి,శ్రీనివాసాద్రి,చింతామణిగిరి,వృషభాద్రి,వరాహాద్రి,జ్ఞానాద్రి,కనకాచలము,ఆనందాద్రి,నీలాద్రి,సుమేరు,శిఖరాచలము,వైకుంఠాద్రి,పుష్కరాద్రి.
శివశక్తులు చేసిన గణపతి స్తుతి, భుక్తి ముక్తి ప్రదం, ధన ధాన్య ప్రదం అయిన స్తుతి:
నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః
భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక
స్వానందవాసినే తుభ్యం సిద్ధి బుద్ధి వరాయ చ
నాభిశేషాయ దేవాయ ఢుంఢి రాజాయ తే నమః
వరదాభయ హస్తాయ నమః పరశుధారిణే
నమస్తే సృణిహస్తాయ నాగభూషాయ తే నమః
అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయ తే నమః
సగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయ చ
బ్రహ్మభ్యోః బ్రహ్మదాత్రే చ గజానన నమోస్తుతే
ఆదిపూజ్యాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠరాజాయ తే నమః
మాత్రే పిత్రే చ సర్వేషాం హేరంభాయ నమో నమః
అనాదయే చ విఘ్నేశ విఘ్నకర్త్రే నమోనమః
విఘ్నహర్త్రే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే
త్వదీయ భక్తియోగేన యోగీశః శాంతిమాగతాః
అర్జున కృత దుర్గాస్తోత్రమ్: ఉదయమే లేచి ఈ స్తోత్రం చదివిన వారికి యక్షరాక్షస పిశాచాల భయం ఎన్నడూ ఉండదు. వారికి సర్పాదుల వల్ల భయం ఉండదు. శత్రు భయం ఉండదు. రాజభయం కూడా వానికి కలుగదు. వివాదంలో వానికే జయం కలుగుతుంది. బంధితుడు ఆ బంధనం నుండి విడుదల పొందుతాడు. కష్టాలనుండి దొంగల బెడద నుండి బయట పడతాడు. యుద్ధాల్లో విజయం పొందుతాడు. స్వచ్ఛమైన ఐశ్వర్యాన్ని పొందుతాడు. ఆరోగ్యబలాలతో నిండి నూరేళ్ళు సుఖంగా జీవిస్తాడు. (Click the picture to enlarge!)
మన బ్రతుకులన్నీ కాలాధీనం. ఎవరికైనా కాలం అనుకూలించేటట్లు చేసే దైవం “శ్రీ కాలభైరవుడు”. కృష్ణపక్షంలో వచ్చే అష్టమి రోజున (ప్రత్యేకంగా సాయంత్రం) ఆ దేవుని స్మరించుకోవడం సర్వాభీష్ట ప్రదాయకం. శ్రీ శైవ మహాపురాణంలో శ్రీ ఉపమన్యు మహర్షి వారు దర్శించిన “శ్రీ శివ పంచావరణ స్తోత్రం”లో చెప్పబడ్డ కాలభైరవుని ప్రార్థిద్దాం:
క్షేత్రపాలో మహతేజా నీలజీమూత సన్నిభః;
దంష్ట్రాకరాళ వదనః స్ఫురద్రక్తాధరోజ్జ్వలః
రక్తోర్ధ్వ మూర్ధజశ్శ్రీమాన్ భ్రుకుటీ కుటిలేక్షణః;
రక్తవృత్త త్రినయనశ్శశి పన్నగ భూషణః
నగ్నస్త్రిశూల పాశాసి కపాలోద్యత పాణికః ;
భైరవో భైరవైస్సిద్ధైర్యోగినీభిశ్చ సంవృతః
క్షేత్రే క్షేత్రే సమాసీనః స్థితో యో రక్షకస్సతాం;
శివప్రణామ పరమః శివ సద్భావ భావితః
శివాశ్రితాన్ విశేషేణ రక్షన్ పుత్రానివౌరసాన్ ;
సత్కృత్య శివయోరాఙ్ఞాం స మే దిశతు మంగళం
వీరభద్రో మహాతేజా హిమకుందేందు సన్నిభః ;
భద్రకాళీ ప్రియో నిత్యం మాతౄణాంచాభిరక్షితా
యఙ్ఞస్య చ శిరోహర్తా దక్షస్య చ దురాత్మనః ;
ఉపేంద్రేంద్ర యమాదీనాం దేవానాం అంగ తక్షకః
శివస్యానుచరః శ్రీమాన్ శివశాసన పాలకః ;
శివయోశ్శాసనాదేవ స మే దిశతు కాంక్షితం
శివ వదనాలను స్మరించితే సర్వశుభప్రదం:
ఈశాన తే తత్పురుష వాసుదేవాయ తే నమః అఘోరాయ నమస్తుభ్యం సద్యోజాతాయ వై నమః
ఈశానుడవు ,తత్పురుషుడవు,వాసుదేవుడవు,అఘోరుడవు,సద్యోజాతుడవు,అయిన సదాశివ నీకు నమస్కారము.శివునిది పంచముఖాల స్తోత్రమిది.పంచాక్షరీ మంత్రానికి, ప్ర “పంచ” శక్తులకి మూలమైన ఈ శివవాదనాలను స్మరించితే సర్వశుభప్రదం.
షష్టి దేవి స్తుతి:
పిల్లలను రక్షిస్తు,వాళ్ళకి ఎలాంటి ఆపదలు దరి చేరనివ్వకుండా చూసుకునే తల్లి.దేవసేనమాత, ఆవిడ షష్టి దేవిగా పూజలు అందుకుంటోంది.
ఈ దివ్యమైన స్తుతి రోజు ఒక్కసారి చదువుకుంటే ఆవిడ పరమ ప్రసన్నురాలై పిల్లలకు రక్షణగా ఉంటుంది.బాలారిష్టాలు తొలగిపోతాయి. పిల్లలకు ఆయురారోగ్యాలను ప్రసాదించే అమ్మ.
షష్టి దేవి నమో నమః
నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై షష్ట్యై దేవ్యై నమో నమః
వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః
సుఖ దాయై మోక్షదాయై షష్ట్యై దేవ్యై నమో నమః
సృష్టె షష్ఠాంశరూపాయై సిద్ధాయైచ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీ దేవ్యై నమో నమః
సారయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః
బాలాధిష్ఠా తృ దేవ్యై చ షష్ఠీ దేవ్యై నమో నమః
కల్యాణ దేవ్యై కల్యాణ్యై ఫల దాయైచ కర్మణాం
ప్రత్యక్షా యై సర్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్యేషాం సర్వ కర్మసు
దేవ రక్షణ కారిణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః
శుద్ధ సత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా
హింసా క్రోధ వర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః
ధనం దేహి జయం దేహి పుత్రందేహి సురేశ్వరీ !
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్ఠీ దేవి నమో నమః
దేహి భూమిం ప్రజాం దేహి విద్యాందేహి సుపూజితే
కల్యాణం చ జయం దేహి విద్యా దేవి నమో నమః
నమోస్తుతే నమోస్తుతే షష్ఠీ దేవి నమో నమః
శ్రీ రామ శ్లోకం:
కష్టాలను గట్టెక్కించే కరుణామూర్తి, మనకు వచ్చిన ఆపదలను తొలగించి శాంతిని సుఖాన్ని ప్రసాదించే పరంధాముడు ఆ శ్రీరాముడు. సుఖ, శాంతులు, ఆయురారోగ్యాలే కదా ఆయన మనకిచ్చే సంపదలు. ఆపత్కాలంలో ఈ శ్లోకాన్ని జపిస్తే అన్ని బాధలు తొలగిపోతాయని అందరి నమ్మకం. అటువంటి మహిమాన్వితుడైన సుందర రామునికి ఎల్లప్పుడూ తలచుకుంటాం. అదే ఈ శ్రీ రామ శ్లోకం.
ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్
తాత్పర్యం: ఆపదలను పోగొట్టువాడు, అన్ని సంపదలను ఇచ్చువాడు, లోకములో అతి సుందరమైన వాడైనట్టి శ్రీ రామచంద్రునికి మాటి మాటికి నమస్కరిస్తున్నాను.
రక్షా కవచం:
వనమాలీ గదీశార్ఙ్గీశంఖీ చక్రీ చ నందకీ!
శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు!!
-ఇది ఒక కవచ స్తోత్రం. ప్రతికూలతలను తొలగించి, అన్నింటినీ సానుకూలపరచే రక్షాస్తుతి ఇది. నారాయణుని దివ్యాయుధాలన్నీ పై శ్లోకం మొదటి పాదంలో ఉన్నాయి. ఆ ఆయుధాలు స్మరణ మాత్రం చేత రక్షించే శక్తి కలవు.
“వనమాలను ధరించి, గద (కౌమోదికి) శార్ఙ్గ (ధనస్సు), శంఖం (పాంచజన్యం) చక్రం (సుదర్శనం), ఖడ్గం ( నందకం), – ఆయుధాలుగా దాల్చిన లక్ష్మీ సమేతుడైన నారాయణుడు, విష్ణువు, వాసుదేవుడు అన్ని విధముల రక్షించుగాక!” నారాయణుని శక్తిమంతమైన నామాల్లో ప్రధానమైన మూడు నామాలు పై శ్లోకంలో ఉన్నాయి. నారాయణ, విష్ణు, వాసుదేవ – అనే దివ్యనామాలు విష్ణు గాయత్రిలోని మంత్రాలు. వాటితో కూర్చిన పై శ్లోకం అద్భుత రక్షాకవచం
చతుశ్శ్లోకీ భాగవతం:
శ్రీ భగవానువాచ:
జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞానసమన్వితమ్!
రహస్యం చ తదంగం చ గృహాణ గదితం మయా!!01!!
యావానహం యథా భావో యద్రూపగుణకర్మశః!
తథైవ తత్త్వవిజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్!!02!!
అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్సదసత్పరమ్!
పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహమ్!!03!!
ఋతేర్థం యత్ప్రతీయేత న ప్రతీయేత చాత్మని!
తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథాతమః!!04!!
యథామహాంతి భూతాని భూతేషూచ్చావచేష్వపి!
ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహమ్!!05!!
ఏతావదేవ జిజ్ఞాస్యం తత్త్వజిజ్ఞాసునాత్మనః!
అన్వయ వ్యతిరేకాభ్యాం యస్స్యాత్ సర్వత్ర సర్వదా!!06!!
ఏతన్మతం సమాతిష్ఠ పరమేణ సమాధినా!
భవాన్ కల్పవికల్పేషు న విముహ్యతి కర్హిచిత్!!07!!
వారాహి దేవి 12 రక్షణ నామాలు:
ఈ పన్నెండు నామాలు ప్రతివారు జపించుకోవచ్చు.పంచమి ,దండనాథా, సంకేత, సమయేశ్వరి,సమయసంకేతా,వారాహి,పోత్రిణి,శివ,వార్తాళి, మహాసేన,ఆజ్ఞాచక్రేశ్వరి, అరిఘ్ని.వీటిని నమస్కారంతో చేస్తే మంత్రం అవుతుంది.
శ్రీ పంచమ్యై నమః, శ్రీ దండనాథయై నమః, శ్రీ సంకేతాయై నమః, శ్రీ సమయేశ్వర్యై నమః, శ్రీ సమయసంకేతాయై నమః, శ్రీ వారాహ్యై నమః, శ్రీ పోత్రిణ్యై నమః, శ్రీ శివాయై నమః, శ్రీ వార్తాళ్యై నమః, శ్రీ మహాసేనాయై నమః, శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, శ్రీ అరిఘ్న్యై నమః
అ౦దరూ జపి౦చదగ్గ గాయత్రీ మ౦త్రాలు:త్రిస౦ధ్యలలో వీటిని జపిస్తే అదే వారికి గాయత్రీ అవుతుంది.
* సర్వ చైతన్య రూపా౦ తా౦ ఆద్యా౦ విద్యా౦ చ ధీమహి, బుద్ధి౦ యా నః ప్రచోదయాత్!
* పరమేశ్వరాయ విద్మహే పరతత్త్వాయ ధీమహి, తన్నో బ్రహ్మ ప్రచోదయాత్!
* యో దేవస్సవితాస్మాక౦ ధియో ధర్మాది గోచరాః!
ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే!!